Header Banner

మరో 10 రోజుల్లోనే ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రాత పరీక్షలు..! మొత్తం 1.2 కోట్ల మంది పోటీ!

  Sun May 25, 2025 08:59        Education

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.2 కోట్ల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఈ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది.

తాజా ప్రకటన మేరకు రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టులలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 10.30 వరకు, సెకండ్‌ షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12.45 నుంచి 2.15 గంటల వరకు, థార్డ్‌ షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. సీబీటీ 1 పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మూడవ వంతు మార్కును తగ్గిస్తారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన వారికి వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.

జేఈఈ మెయిన్‌ 2025 పేపర్‌2 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

బీఆర్క్‌/ బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 రెండో విడత (ఏప్రిల్‌) పేపర్‌ 2 ఎగ్జామినేషన్‌ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RRBNTPC2025 #RRBExams #RailwayJobs #NTPCExamUpdate #GovernmentJobs #JobAlert